IOCL Recruitment 2022: గేట్‌ 2022 స్కోర్ ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్‌ పోస్టుల (Graduate Apprentice Posts) భర్తీకి అర్హులైన..

IOCL Recruitment 2022: గేట్‌ 2022 స్కోర్ ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం..
Iocl
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:05 PM

IOCL Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్‌ పోస్టుల (Graduate Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఇంజనీర్‌ పోస్టులు

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌

వయో పరిమితి: జూన్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: అప్రెంటిస్‌ టైంలో స్టైపెండ్‌ అందజేస్తారు. అనంతరం ఇంజనీర్లుగా నియమించినప్పటి నుంచి నెలకు రూ. 50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP 10th Class Paper Leak: టెన్త్‌ క్వశ్చన్ పేపర్ల లీక్‌లో నారాయణ విద్యాసంస్థల హస్తం..12కు చేరిన నిందితుల సంఖ్య!