IB Recruitment: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 677 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 362 సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులతో పాటు 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తుంపు పొందిన బోర్డు నుంచి సెకండరీ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయసు పరిమితి విషయానికొస్తే.. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు...

పదో తరగతి పూర్తి చేసే చాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం పొందే లక్కీ ఛాన్స్. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న అసిస్టెంట్ సెక్యూరిటీ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 677 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 362 సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులతో పాటు 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తుంపు పొందిన బోర్డు నుంచి సెకండరీ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయసు పరిమితి విషయానికొస్తే.. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇక మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 14 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 13ని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం హోమ్ పేజీలో ఐబీపై క్లిక్ చేయాలి. అనంతరం లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటో, సంతకంతో పాటు అవసరమైన ఇతర సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్‌మిట్ నొక్కాలి. చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక అభ్యర్థులను టైర్ I, టైర్ II రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదట టైర్ I పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్-I పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టైర్-II పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రెండు పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా, తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..




