IOCL Jobs: ఇండియన్‌ ఆయిల్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 400కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు వచ్చే నెల 21వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IOCL Jobs: ఇండియన్‌ ఆయిల్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Indian Oil Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2024 | 7:36 AM

కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 400కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు వచ్చే నెల 21వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 467 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV -379 పోస్టులు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ 21 పోస్టులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ 38 పోస్టులు, టెక్నికల్ అటెండెంట్ 29 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితికి సంబంధించిన వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఇక ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్‌ ఆయిల్‌ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అడ్మిట్ కార్డును సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి అందిస్తారు. సెప్టెంబర్‌ మూడో వారంలో పరీక్ష ఉంటుంది. ఫలితాలను అక్టోబర్‌ 3వ వారంలో విడుదల చేయనున్నారు.

ఇక ఎంపిక విధానం విషయానికొస్తే ఈ పోస్టులను.. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు.. స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్ పరీక్ష విషయానికొస్తే మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉండే ఈ ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఉంటుంది. ఇందులో క్వాలిఫై కావడానికి కనీసం 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (NCL) అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్‌ రిఫండబుల్‌. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..