Indian Navy Recruitment 2021: ఇంటర్ విద్యార్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్ విభాగంలో AA (Artificer Apprentice), సీనియర్ సెకండరీ రిక్రూట్...
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్ విభాగంలో AA (Artificer Apprentice), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ను సందర్శించండి. గతేడాది 2700 ఖాళీలను భర్తీ చేశారు. ఈసారి కూడా ఇంచుమించు అదే స్థాయిలో భర్తీ చేయనున్నారని సమాచారం.
ముఖ్యమైన తేదీలు..
* 2021 ఏప్రిల్ 26న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభమవుతుంది. * దరఖాస్తుకు 2021, ఏప్రిల్ 30 చివరి తేదీ.
భర్తీ చేయనున్న పోస్టులు..
సెయిలర్ – సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) సెయిలర్ – Artificer Apprentice (AA)
జీత భత్యాలు..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైఫండ్‌గా అందిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక.. హోదాను బట్టి రూ. 21,700 – 69,100 వరకు జీతం ఉంటుంది.
విద్యార్హతలు..
సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ ఎస్ ఆర్) – 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. (మ్యాథ్స్, ఫిజిక్స్‌లో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి) Artificer Apprentice (AA) – మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్‌తో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం..
* ఆన్‌లైన్ పరీక్ష * ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ * మెడికల్ పరీక్ష
Also Read: JEE Mains 2021: ఎన్‌టీఏ కీలక నిర్ణయం.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..
NTPC Recruitment 2021: పరీక్ష లేకుండానే ఎన్టీపీసీలో ఉద్యోగ అవకాశాలు.. మహిళలకు మాత్రమే..
FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవాలంటే..