FSSAI Recruitment 2021: ఫుడ్‌ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవాలంటే..

FSSAI Recruitment 2021: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్...

FSSAI Recruitment 2021: ఫుడ్‌ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవాలంటే..
Fssai Recruitment
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2021 | 8:32 AM

FSSAI Recruitment 2021: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిన్సిపాల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 16న మొదలైంది. దరఖాస్తు చేయడానికి 2021 మే 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.in/ లో తెలుసుకోవచ్చు. అయితే ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 మే 31లోగా చేరేలా పంపాలి. మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రిన్సిపాల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్ (టెక్నికల్), జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్, మేనేజర్, మార్కెటింగ్, సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా లేబర్ లేదా సోషల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 16 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 15 ఆన్‌లైన్ దరఖాస్తులు పోస్టులో చేరడానికి చివరి తేదీ- 2021 మే 31

ఇవీ చదవండి: Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!

Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు… ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..