Telangana EdCET 2021: విడుదలైన తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేష్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
Telangana EdCET 2021: తెలలంగాణ ఎడ్‌సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోమని తెలిపారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఏప్రిల్ 19 నుంచి మొదలై జూన్ 15వరకు అందుబాటులో...
Telangana EdCET 2021: తెలలంగాణ ఎడ్‌సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోమని తెలిపారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఏప్రిల్ 19 నుంచి మొదలై జూన్ 15వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక పరీక్షల విషయానికొస్తే.. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రం విషయమై ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ కీలక విషయం తెలిపారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని తెలిపారు. టీఎస్ ఎడ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఎడ్‌సెట్‌కు అప్లై చేసుకోవాలనుకునే వారు జూలై 1, 2021 నాటికి 19 ఏళ్లు పూర్తై ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. రూ. 650, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ 450గా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- ఏప్రిల్ 19, 2021 * దరఖాస్తుకు చివరి తేదీ- జూన్ 15, 2021 * జూన్ 25 వరకు రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
* జూలై 5 వరకు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
* జూలై 20 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు… నోటిఫికేషన్ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ