NTPC Recruitment 2021: పరీక్ష లేకుండానే ఎన్టీపీసీలో ఉద్యోగ అవకాశాలు.. మహిళలకు మాత్రమే..
NTPC Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్...
NTPC Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా 50 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* మెకానికల్ (14), ఎలక్ట్రికల్ (22), ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (14) విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.
* దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 16న ప్రారంభమైంది. చివరి తేదీగా మే 6ను నిర్ణయించారు.
* అభ్యర్థులను గేట్ 2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
* అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీలో తప్పనిసరిగా 65 శాతం మార్కులు సాధించి ఉండాలి.
* ఫైనల్ ఇయర్, సెమిస్టర్ లో ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
* అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను డ్యాక్యుమెంట్ వెరికేషన్ చేపట్టి.. ఎంపిక చేసుకుంటారు.
* మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ ntpccareers.netను చూడండి.
Also Read: FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవాలంటే..
SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం