IPPB Recruitment: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. రెండు లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..

IPPB Recruitment: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు...

IPPB Recruitment: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. రెండు లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..
Ippb Recruitment
Follow us

|

Updated on: Oct 12, 2021 | 5:55 PM

IPPB Recruitment: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మేనేజర్; సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* ఇంటిగ్రేషన్‌ ఆర్కిటెక్ట్‌, డిజిటల్‌ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థలుకు సంబంధిత పనిలో అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 01-09-2021 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 94,000 నుంచి రూ. 2,92000 జీతంగా అందిస్తారు.

* అభ్యర్థులను అసెస్‌మెంట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-10-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Tanish: ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్

Ram Gopal Varma: దేవుడిని నమ్మనని చెప్పే ఆర్‌జీవీ.. గుడి మెట్లు ఎక్కాడు. ఇదంతా ఎవరి కోసమో తెలుసా.?

Viral Video: అరుదైన జీవి ‘సింహం చేప’… అందంగా ఉందని పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు..! వీడియో