India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టల్‌ శాఖలో భారీగా కొలువులు! పది పాసైతే చాలు.. నో ఎగ్జాం

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో యేటా వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీగా జీడీఎస్‌ ఖాళీల భర్తీకి పోస్టల్‌ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం..

India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టల్‌ శాఖలో భారీగా కొలువులు! పది పాసైతే చాలు.. నో ఎగ్జాం
India Post GDS Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 15, 2024 | 10:02 AM

న్యూఢిల్లీ, జులై 15: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో యేటా వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీగా జీడీఎస్‌ ఖాళీల భర్తీకి పోస్టల్‌ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది జనవరిలో 40 వేల జీడీఎస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది కూడా సుమారుగా 40 వేలకు పైగా పోస్టులకు ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ నియామకాలు చేపడతారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో ఆయా బ్రాంచుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక జీతభత్యాల విషయానికొస్తే పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. వీరికి పనివేళలు కూడా తక్కువే. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది.

వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన అదనంగా సేవలు అందిస్తే.. అందుకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. రానున్న నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ దోస్త్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

తెలంగాణ దోస్త్‌ ద్వారా మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన తర్వాత ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుంది. ఇందుకు గడువు జులై 12తో ముగిసింది. ఈ క్రమంలో గడువును మరికొన్ని రోజులకు పెంచాలని విద్యార్థులు ఉన్నత విద్యామండలికి విజ్ఞప్తులు చేశారు. దీంతో జులై 18 వరకు గడువు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. కాగా ఇప్పటివరకు 1,17,057 మంది విద్యార్ధులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.