IIT Kharagpur Jobs: డిగ్రీ అర్హతతో..ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 40 జూనియర్‌ అసిస్టెంట్‌ జాబ్స్‌.. 69 వేల జీతంతో..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IIT Kharagpur Jobs: డిగ్రీ అర్హతతో..ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 40 జూనియర్‌ అసిస్టెంట్‌ జాబ్స్‌.. 69 వేల జీతంతో..
Iit Kharagpur
Follow us

|

Updated on: Mar 05, 2022 | 6:06 PM

IIT Kharagpur Junior Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 40

పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, బయోసైన్స్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ వంటి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో నైపుణ్యంతోపాటు, టైపింగ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఇతర అభ్యర్ధులకు: రూ. 250
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..