AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HPCL Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

డిప్లొమా, డిగ్రీ అర్హతతో.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు మరో వారం రోజులో గడువు ఉంది..

HPCL Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
HPCL Jobs
Srilakshmi C
|

Updated on: May 15, 2025 | 8:41 AM

Share

ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. వివిధ విభాగంల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆకర్షణీయ జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు.

పోస్టుల వివరాలు ఇవే..

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్ పోస్టుల సంఖ్య: 11
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్ పోస్టుల సంఖ్య: 17
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టుల సంఖ్య: 6
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్ పోస్టుల సంఖ్య: 41
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ & సేఫ్టీ పోస్టుల సంఖ్య: 28

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ అండ్‌ సేఫ్టీలో 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే సైన్స్‌ విభాగంలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి కింద దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ వారికి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.1180 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు పీజు లేదు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్, టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..