Andhra Pradesh: నెలకు రూ.60 వేల జీతంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోనున్న గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన సైకియాట్రిస్ట్‌, కౌన్సెలర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి..

Andhra Pradesh: నెలకు రూ.60 వేల జీతంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
GGH Ongole Recruitment 2022

Updated on: Dec 04, 2022 | 2:39 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోనున్న గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన సైకియాట్రిస్ట్‌, కౌన్సెలర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు అకౌంట్స్‌లో పరిజ్ఞానం ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 12, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఎంపిక విధానం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

సూపరింటెండెంట్‌, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పటల్‌, భాగ్యనగర్‌, ఒంగోలు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.