ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలు జీతం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
ESIC Recruitment: ఎంప్లాయీస్ స్టేట్ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన డెంటల్ ఇన్‌స్టిట్యూషన్, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా టీచింగ్ విభాగంలో..
ESIC Recruitment: ఎంప్లాయీస్ స్టేట్ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన డెంటల్ ఇన్‌స్టిట్యూషన్, మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా టీచింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేసన్‌లో భాగంగా మొత్తం 218 పోస్టులకు భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెడికల్ ఇన్‌స్టిట్యూషన్ (103), డెంటల్ ఇన్‌స్టిట్యూటష్ (115) ఖాళీలు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎండీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* మొదట ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్‌తో పాటు సంబంధిత డ్యాక్యుమెంట్లను జత చేసి ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
* మెడికల్ ఇన్‌స్టిట్యూషన్ దరఖాస్తులను ది రీజినల్ డైరెక్టర్ ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచదీప్ భవన్, సెక్టర్ 16, ఫరియాబాద్, హర్యానా అడ్రస్‌కు పంపిచాలి. అదే విధంగా డెంటల్ ఇన్‌స్టిట్యూషన్ దరఖాస్తులను ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్, డీడీఏ కాంప్లెక్స్ కమ్ ఆఫీస్, రాజేంద్రభవన్, న్యూ ఢిల్లీ -110008 అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు మే 11ను చివరి తేదీగా నిర్ణయించారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. శరవేగంగా గాడ్ ఫాదర్ షూటింగ్..
Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. శరవేగంగా గాడ్ ఫాదర్ షూటింగ్..