Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. శరవేగంగా గాడ్ ఫాదర్ షూటింగ్..
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా గాడ్ ఫాదర్ రానున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)153వ చిత్రంగా గాడ్ ఫాదర్ రానున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోసల్మాన్ ఖాన్(Salman khan) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే సల్మాన్ తన పార్ట్ ను పూర్తి చేశారు. సల్మాన్ ఈ మూవీలో పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. తెలుగులో సల్మాన్‌ఖాన్ నటించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లు ఇద్దరూ ఒకేచోట కనిపించడం అభిమానులకు పండుగే. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాల తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్ ఫుల్ బిజీ కానున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ , బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాలు చేస్తున్నారు చిరు.
మరిన్ని ఇక్కడ చదవండి :