Ram Gopal Varma: వర్మకు ముద్దు పెట్టేసిన ముద్దుగుమ్మ.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..
Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉంటారు. ఒకవేళ ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే తానే స్వయంగా కాంట్రవర్సీని సృష్టిస్తుంటారు. చేసే సినిమాల నుంచి వ్యక్తిగత..
Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉంటారు. ఒకవేళ ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే తానే స్వయంగా కాంట్రవర్సీని సృష్టిస్తుంటారు. చేసే సినిమాల నుంచి వ్యక్తిగత జీవితం వరకు అంతా సంచలనమే. అందుకే ఆయన సంచలనాలకు మారుపేరుగా మారారు. వర్మ తాజాగా ‘డేంజరస్’ అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. లెస్బియన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను విడుదల చేయమంటూ కొన్ని థియేటర్లు నిరాకరించడంతో వర్మ సినిమాను కొన్ని రోజులపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ ఇందులోని హీరోయిన్స్ నైనా గంగూలీ, అప్సర రాణిలతో సందడి చేశారు. ఇద్దరు నటీమణులతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు వర్మ. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు (గురువారం) వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు ‘డేంజరేస్’ హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణిలు కూడా హాజరయ్యారు.
View this post on Instagram
ఈ నేపథ్యంలోనే నటి నైనా గంగూలీ వర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ బుగ్గపై ముద్దు పెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలా పోస్ట్ చేశారో లేదో అలా వైరల్ అవుతోంది. ఇక మరో హీరోయిన్ అప్సర రాణితో వర్మ కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. వర్మ చేస్తున్న ఈ సందడి చూసిన నెటిజన్లు లైఫ్ అంటే నీదే బాసూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Happy birthday to my Guardian Angel @rgvzoomin ❤️ pic.twitter.com/7z0UoEWFIh
— Apsara Rani (@_apsara_rani) April 7, 2022
Also Read: US Green Card: అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..!
TRS: టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే వనమా ముందు కన్నీటి పర్యంతమైన చైర్‌పర్సన్
Early Dinner Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి భోజనం ఇలా చేయండి..