US Green Card: అమెరికా గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్‌ న్యూస్‌..!

US Green Card: అమెరికా గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్‌ న్యూస్ తెలిపింది. ప్రస్తుత ఉన్న పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూఎస్‌ (US Congress)..

US Green Card: అమెరికా గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్‌ న్యూస్‌..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 09, 2022 | 6:44 AM

US Green Card: అమెరికా గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్‌ న్యూస్ తెలిపింది. ప్రస్తుత ఉన్న పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూఎస్‌ (US Congress) కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ. అగ్రరాజ్య ఇమిగ్రేషన్‌ (Immigration)నిబంధనల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల విషయంలో అమెరికా (America) గ్రీన్‌ కార్డుల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న దేశాల వారీ పరిమితిని ఎత్తేస్తున్నారు. ఈ దిశగా కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్​కు సంబంధించిన పెర్​కంట్రీ క్యాప్​ను పెంచనున్నారు. ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉండగా దానిని 15 శాతానికి పెంచాలని హౌస్‌ కమిటీ సూచించింది.

హెచ్‌ఆర్‌3648 లేదా ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్ –యాక్ట్‌ అనేఈ బిల్లుపై హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. యూఎస్‌ సెనేట్‌ కూదా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అక్కడ కూడా చర్చ తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత బిల్లును అధ్యక్షుడు జో బైడెన్​ఆమెదించాక చట్టరూపం దాల్చనుంది.

అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే భారతీయులు అత్యధికంగా లబ్ది పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.. ముఖ్యంగా హెచ్​-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. వీరిలో ఎంతో మంది దశాబ్దాలుగా గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో 71.9% చైనా, భారత్‌లకు చెందినవారే. భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగింది. చైనా నుంచి వెళ్లినవారి సంఖ్య 8 శాతానికిపైగా తగ్గింది.ఇ

ఇవి కూడా చదవండి:

China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చిన చైనా.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!

Tax Issue: టాక్స్ చెల్లించని దిగ్గజ వ్యాపారి కుమార్తె.. ప్రజలపై భారీగా పన్నులు పెంచారంటూ ప్రతిపక్షాల విమర్శలు

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు