EIL Recruitment 2022: డిప్లొమా అర్హతతో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో 60 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL).. జూనియర్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ II, గ్రేడ్ I పోస్టుల (Junior Draftsman Grade II and I Posts) భర్తీకి అర్హులైన..
EIL New Delhi Junior Draftsman Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL).. జూనియర్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ II, గ్రేడ్ I పోస్టుల (Junior Draftsman Grade II and I Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: జూనియర్ డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ II (27), గ్రేడ్ I (33) పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.25,000ల నుంచి రూ.1,15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి మెకానికల్/సివిల్/ఆర్కిటెక్చర్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్‌లో డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: