APPSC Professor Posts: అధ్యాపక పోస్టులకు ముగిసిన దరఖాస్తులు.. ఆన్‌లైన్‌లో కనిపించని ఎకనామిక్స్ సబ్జెక్టు! అభ్యర్ధుల ఆందోళన
యూనివర్సిటీల్లో 3,282 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల కొందరు ఎకనామిక్స్ అభ్యర్థులు నష్టపోయారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నాలుగు పోస్టులకు అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మాత్రం అప్లైడ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాత్రమే చూపారు. ఎకనామిక్స్ కోసం వెదికిన వారికి ఎకనామిక్స్ సబ్జెక్ట్ కనిపించకపోవడంతో కొందరు..
హైదరాబాద్, నవంబర్ 22: యూనివర్సిటీల్లో 3,282 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల కొందరు ఎకనామిక్స్ అభ్యర్థులు నష్టపోయారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నాలుగు పోస్టులకు అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మాత్రం అప్లైడ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాత్రమే చూపారు. ఎకనామిక్స్ కోసం వెదికిన వారికి ఎకనామిక్స్ సబ్జెక్ట్ కనిపించకపోవడంతో కొందరు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
దీంతో కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని యూనిటర్సీలకు ఒకేసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 20 (సోమవారం)తో ముగిసింది. మధ్యలో కొన్ని రోజులు సర్వర్ సమస్య తలెత్తడంతో కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అభ్యర్థులు దరఖాస్తుకు మళ్లీ అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి ఫోన్లు, ఈ-మెయిల్ ద్వారా వినతులు చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు గడువు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. కానీ యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు మాత్రం సాయంత్రం 5 గంటలకే సర్వర్ నిలిపి వేశారు. దీంతో దరఖాస్తుకు మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ పరీక్ష ఫలితాల విడుదల
తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ అయిదో సెమిస్టర్ (బ్యాక్‌లాగ్), ఆరో సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షల ఫలితాలు నవంబరు 21న విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షలకు హాజరైన విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్‌వీ రంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరులో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.