BSEB Class 12 Topper: బోర్డు పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఆటోరిక్షా కొడుకు సంగమ్‌ రాజ్‌! అవును.. నా తండ్రి ఆటో డ్రైవర్‌..

ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి.. కష్టం నీది.. ఆశలు నీవి! తలిచేది నువ్వే.. తలబడేది కూడా నువ్వే.. నీ ప్రయత్నమే నీ విజయం.. నీ విజయమే నీ జీవితం అని అన్నాడో..

BSEB Class 12 Topper: బోర్డు పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఆటోరిక్షా కొడుకు సంగమ్‌ రాజ్‌! అవును.. నా తండ్రి ఆటో డ్రైవర్‌..
Sangam Raj
Follow us

|

Updated on: Mar 17, 2022 | 12:16 PM

BSEB Class 12 Board Exam Topper Sangam Raj story in telugu: ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి.. కష్టం నీది.. ఆశలు నీవి! తలిచేది నువ్వే.. తలబడేది కూడా నువ్వే.. నీ ప్రయత్నమే నీ విజయం.. నీ విజయమే నీ జీవితం అని అన్నాడో కవి. పేదరికాన్ని సాకుగా చూపి అంతటితో ఆగిపోలేదు ఈ విద్యార్ధి. కష్టాల కడగండ్లు ముందరి కాళ్లకు బంధాలు వేసినా అవేవీ అతన్ని మైలు రాయి దాటకుండా ఆపలేకపోయాయి. కసి, పట్టుదలను నరనరాల్లో నింపుకుని అహోరాత్రులు కష్టించే వాళ్లు ఈ భూమిపై చాలా అరుదుగా ఉంటాయి. వీళ్ల కోసం విజయద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ ఏడాది బీహార్‌లో 2021-22 విద్యాసంవత్సరానికిగానూ బీఎస్ఈబీ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. 12వ తరగతి ఆర్ట్స్ స్ట్రీమ్‌ ఫలితాల్లో ఆటో డ్రైవర్‌ కొడుకు సంగమ్‌ రాజ్‌ 96.4 శాతం మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని సవాలుగా స్వీకరించి విజయకేతనాన్ని ఎగురవేశాడు సంగమ్‌ రాజ్‌.

బీహార్‌(Bihar)లోని గోపాల్‌గంజ్‌ వీధుల్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే జనార్ధన్ రాజ్ కుమారుడు సంగమ్ రాజ్. కుమారుడు సాధించిన విజయాన్ని ఆ తల్లిదండ్రులు ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆటో రిక్షా డ్రైవర్‌ కొడుకని తనను చూసి వెక్కించిన వారందరికీ, ఇప్పుడు తన తండ్రి ఆటో రిక్షా డ్రైవరని గర్వంగా చెప్పుకుంటానని, తన తండ్రి ఎన్నో కష్టాలు పడి అండగా నిలబడ్డాడని, ఈ విజయం తనకు చదువు చెప్పిన టీచర్లు, తన తల్లిదండ్రులదని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగమ్‌ రాజ్‌ తెలిపాడు. క్రెడిట్‌ మొత్తం వారికే ఆపాధించాడీ వినయశీలి. సంగమ్‌ రాజ్‌ భవిష్యత్తు ప్రణాళిక గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) అధికారి అవ్వాలని కోరుకుంటున్నట్లు, ఇంకా కష్టపడి చదివి కఠినమైన సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను ఛేదిస్తానని సంగమ్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపాడు.

కాగా బీఎస్ఈబీ (BSEB) 12 బోర్డ్ ఎగ్జామ్స్ 2022 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ biharboardonline.bihar.gov.in లేదా onlinebseb.inలో మార్చి 16న విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర మొత్తం ఉత్తీర్ణత శాతం 80 శాతం దాటింది. ఇది గతేడాది కంటే ఎక్కువే.

Also Read:

GATE 2022 results: గేట్ 2022 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్ అవుతుందంటే..