HAL Recruitment 2022: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరాపుట్ (ఒడిశా)లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల (Medical Staff posts) భర్తీకి..
HAL Koraput Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోరాపుట్ (ఒడిశా)లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల (Medical Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 15
ఖాళీల వివరాలు: మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు.
విభాగాలు: జనరల్ మెడిసిన్, ఆఫ్తమాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: జనవరి 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Chief Manager (HR), Recruitment Cell, Koraput Division, Hindustan Aeronautics Limited, Koraput Division, Sunabeda-763002, Dist: Koraput, Odisha.
దరఖాస్తు రుసుము: రూ. 500
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: