DRDO Recruitment: రక్షణ రంగ సంస్థలో అప్రెంటిస్ చేసే సదవకాశం.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?
DRDO Recruitment: భారత రక్షణ రంగానికి చెందిన డీఆర్‌డీవో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశా చాందీపూర్లోని డిఆర్‌డివోకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు...
DRDO Recruitment: భారత రక్షణ రంగానికి చెందిన డీఆర్‌డీవో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశా చాందీపూర్లోని డిఆర్‌డివోకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, బిఎల్‌ఐఎస్సీ, బీబీఏ, బీకాం, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్, బాలాసోర్, ఒడిశా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు 17-10-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..