DMHO Siddipet Jobs 2022: రాత పరీక్షలేకుండా.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట జిల్లా (Siddipet District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 82 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
DMHO Siddipet District Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట జిల్లా (Siddipet District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 82 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంస్/బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: District Medical & Health Office, 2nd floor, Integrated District Office Complex, Diddeda, Siddipet District, Telangana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.