ACTREC Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్‌డ్ సింటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC).. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి..
ACTREC Professor Recruitment 2022: భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్‌డ్ సింటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC).. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంఎస్/ఎండీ/డీఎం/డీఎన్‌బీ/ఎండీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా అక్టోబర్ 8, 2022వ తేదీ నాటికి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 8, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.78,800ల నుంచి రూ.1,23,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.