CTET Exam 2021: CTET అప్లికేషన్‌లో పొరపాటు చేశారా? వెంటనే సరి చేసుకోండి.. సవరణకు చివరీ తేదీ ఎప్పుడంటే..!

CTET Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET పరీక్షను 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహించనుంది.

CTET Exam 2021: CTET అప్లికేషన్‌లో పొరపాటు చేశారా? వెంటనే సరి చేసుకోండి.. సవరణకు చివరీ తేదీ ఎప్పుడంటే..!
Ctet
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2021 | 1:51 PM

CTET Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET పరీక్షను 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహించనుంది. CBSE ప్రకటన ప్రకారం.. చాలా మంది అభ్యర్థులు తమ ఫోటో, సంతకంలో పొరపాట్లు చేసి.. ఇప్పటి వరకు సవరణలు చేయలేదు. అలాంటి అభ్యర్థులు డిసెంబర్ 13, 2021 వరకు సరి చేసుకోవడానికి బోర్డు అవకాశం ఇచ్చింది. అంతకుముందు 11 డిసెంబర్ 2021 వరకు మాత్రమే సవరణకు అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు మరో రెండు రోజులు గడువు పెంచింది సీబీఎస్ఈ. బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. చాలామంది అభ్యర్థులు తమ ఫోటో, సంతకం సరైన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయనందున వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాంటి అభ్యర్థులు కూడా తమ తప్పులను సరి చేసుకోవచ్చునని బోర్డు తెలిపింది.

ఇకపోతే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021(CTET) పరీక్షకు సంబంధించి ఇప్పటికే అడ్మిట్ కార్డ్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్- ctet.nic.in లో ఈ అడ్మిట్ కార్డు అందుబాటులో ఉంది. పరీక్ష రాసేవారు అడ్మిట్ కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. సీటెట్ అడ్మిట్ కార్డును రెండు దశలలో జారీ చేయనున్నారు. మొదటి దశలో ముందస్తు అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. ఇందులో అభ్యర్థుల పరీక్షా కేంద్రం, తేదీ వంటి వివరాలు ఉంటాయి. రెండవ దశలో ప్రధాన అడ్మిట్ కార్డ్‌ను పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు జారీ చేస్తారు. ఈ అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం, అడ్రస్, పరీక్షా సమయం వంటి పూర్తి వివరాలు ఉంటాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌లో పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.

పరీక్ష సమయం.. నిర్ణీత తేదీల్లో రెండు విడతల్లో పరీక్ష జరుగుతుంది. మొదటి విడతలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత, కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. CTET 2021 ఫలితాలు 15 ఫిబ్రవరి 2022న విడుదల చేస్తారు. CTET 2021కి సంబంధించిన ఏవైనా సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు CBSE CTET హెల్ప్‌లైన్ నంబర్ 011-22240107 లేదా 011-2224012 ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, ctet.cbse@nic.inకి ఇమెయిల్ పంపవచ్చు.

Also read:

Dubai Paperless Governance: సరికొత్త చరిత్ర సృష్టించిన దుబాయ్.. ఆ విషయంలో ప్రపంచంలోనే తొలి దేశంగా..

Royal Enfield: త్వరలో మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. రాజసం మామూలుగా లేదుగా..!

Amaragiri Trip : తెలంగాణ ఊటీ.. దేశంలోనే ఓ అద్భుత పర్యాటక కేంద్రం మన అమరగిరి..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..