Coal India Recruitment 2022: బొగ్గుగనుల మంత్రిత్వశాఖ పరిధిలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 130 పోస్టులు..రూ.2 లక్షల జీతం..

కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 130 మెడికల్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు (Medical Executive posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Coal India Recruitment 2022: బొగ్గుగనుల మంత్రిత్వశాఖ పరిధిలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 130 పోస్టులు..రూ.2 లక్షల జీతం..
Cil
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2022 | 9:46 AM

Coal India Limited Bilaspur Medical Executive Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (Coal India Limited).. 130 మెడికల్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు (Medical Executive posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి అండ్‌ ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దారఖాస్తుదారుల వయసు 35 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 29, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) పోస్టులు: 57
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 70
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ – డెంటల్ (E3) పోస్టులు: 3

అడ్రస్: Dy. GM(Personnel)/HoD(EE), South Eastern Coalfields Limited, Bilaspur.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.