AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Coast Guard: చివరి అవకాశం.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? నేటితో ముగియనున్న గడువు..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా..

Indian Coast Guard: చివరి అవకాశం.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? నేటితో ముగియనున్న గడువు..
Indian Coast Guard Jobs
Narender Vaitla
|

Updated on: Sep 22, 2022 | 10:12 AM

Share

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. సెప్టెంబర్‌ 8న మొదలైన దరఖాస్తుల స్వీకరణ నేటితో (22-09-2022)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నావిక్(జనరల్ డ్యూటీ) (225), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) (40), యాంత్రిక్(మెకానికల్) (16), యాంత్రిక్(ఎలక్ట్రికల్) (10), యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్) (09) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైనత తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నావిక్‌ పోస్టులకు ఎంపికైన వారికి బేసిక్‌ పేగా రూ. 21,700, యాంత్రిక్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 29,200 చెల్లిస్తారు.

* దరఖాస్తు ఫీజుగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (22-09-2022) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..