BEL Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి బంపరాఫర్‌.. విశాఖపట్నంలోని బెల్‌లో ఇంజనీర్‌ పోస్టులు..

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్‌లో..

BEL Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి బంపరాఫర్‌.. విశాఖపట్నంలోని బెల్‌లో ఇంజనీర్‌ పోస్టులు..
Bel Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2022 | 6:25 AM

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రెయినీ ఇంజినీర్‌ (40), ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (60) పోస్టులను భర్తీచేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌(సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ 4 ఏళ్లు బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యునికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌/ కమ్యునికేషన్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న బెల్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..