బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 12 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు మార్చి 1, 2023వ తేదీనాటికి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 25, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.400లు అప్లికేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందినవారు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంలోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Sr Dy Gen. Manager (HR/Military Communications & MR), Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru – 560013.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.