BARC Recruitment 2022: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో కొలువులు! రాత పరీక్షలేకుండానే..

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పరిధిలోని మెడికల్ డివిజన్.. మెడికల్ ఆఫీసర్‌ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి..

BARC Recruitment 2022: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో కొలువులు! రాత పరీక్షలేకుండానే..
Barc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2022 | 9:13 AM

BARC Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పరిధిలోని మెడికల్ డివిజన్.. మెడికల్ ఆఫీసర్‌ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

విభాగాలు: రేడియాలజీ, ఈఎన్‌టీ, అనెస్తీషియా, అబ్‌స్టెట్రిక్స్ అండ్‌ గైనకాలజీ, ఆప్తల్మాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.1,01,988ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టులును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ రూం.2, బార్క్‌ హాస్పిటల్, అణుశక్తి నగర్, ముంబాయి-400094.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చెయ్యండి.

Also Read:

EWS Quota in TS TRT 2022: తొలిసారిగా ఉపాధ్యాయ నియామకాల్లో EWS కోటా అమలు చేయనున్న తెలంగాణ సర్కార్‌!