AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 220 పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 220 పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Narender Vaitla
|

Updated on: Feb 04, 2022 | 9:38 PM

Share

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పలు విభాగాల్లో జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌తో పాటు, సీనియర్‌ మేనేజర్‌, వైస్‌ ప్రెసిండ్‌, రిజినల్‌ సేల్స్‌ మేనేజర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చసి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

* పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో 2 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 22 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 14-02-2022తో గడువు ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో

Digital News Round Up: బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌..! | లేడీ డాన్‌గా అదరగొట్టిన అలియాభట్‌..లైవ్ వీడియో

Black Salt: గోరు వెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు.. పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు..?