Bank Of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు గడువు ఎప్పటి వరకు అంటే..
Bank Of Baroda Jobs: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో..
Bank Of Baroda Jobs: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే చాలా ఉద్యోగ నోటిఫికేషన్స్ వెలువడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తిగల వారు డిసెంబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ 2, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్స్ 12, డెవలపర్ 12, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ 12, UI/UX డిజైనర్2, క్లౌడ్ ఇంజనీర్ 2, అప్లికేషన్ ఆర్కిటెక్ట్ 2, ఇంటిగ్రేషన్ ఎక్సెప్ట్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్ 2, ఎంటర్‌పైజెస్ ఆర్కిటెక్ట్ 2 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.600 ఫీజుఏ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. దరఖాస్తుదారులు హైదరాబాద్, ముంబై ప్రాంతాలను కూడా ఎంచుకోవచ్చు.
అర్హతలు: ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే సంబంధిత నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..? ముందుగా అభ్యర్థులు https://www.bankofbaroda.in/ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో వచ్చే current-opportunities ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక Recruitment of IT Officers / Professionals ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే Apply for Regular Vacancies ఆప్షన్, కాంట్రాక్ట్ కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే Apply for Contractual Vacancies ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫామ్‌లో సూచించిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
ఇవి కూడా చదవండి: