APPSC Group 2 Mains Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కమిషన్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే..
అమరావతి, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అభ్యర్ధులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ బుధవారం (అక్టోబరు 30) ప్రకటించింది. గతంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లోనే పరీక్ష జరగనుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీని విడుదల చేసింది. డీఎస్సీ, టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని, పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా గ్రూప్-2 మెయిన్స్ తేదీలను ఖరారు చేసినట్లు కమిషన్ పేర్కొంది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం నవంబర్ 2న ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. మరోవైపు నవంబర్ మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని ఇతర వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల.. ఐసీఏఐ అధికారిక ప్రకటన
ఐసీఏఐ సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష 2024 ఫలితాలు విడుదలచేసినట్లు ఐసీఏఐ అధికారిక ప్రకటనను జారీ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్ నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
సీఏ ఫౌండేషన్ 2024 కోర్సు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఏ ఇంటర్మీడియట్ 2024 కోర్సు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.