JNV Admissions 2025: తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు మరో ఛాన్స్.. నవోదయ విద్యాలయాల దరఖాస్తు గడువు పెంపు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ..

JNV Admissions 2025: తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు మరో ఛాన్స్.. నవోదయ విద్యాలయాల దరఖాస్తు గడువు పెంపు
JNV Admissions
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:45 AM

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31: దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు అక్టోబర్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధుల అభ్యర్ధన మేరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు నవంబర్‌ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జేఎన్‌వీ లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేవాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 చొప్పున జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా ప్రకటన ప్రకారం నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. యూనివర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు, గతంలో వర్సిటీలో చేరి ఫీజు చెల్లించని విద్యార్థులు కూడా నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని తెలిపారు. వారంతా ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.

ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరేందుకు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వర్సిటీ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 7382929570/580, 040-23680222 333/444/555 ద్వారా కూడా సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నం 18005990101లోనూ సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి