APPSC OTPR: షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు APPSC అలర్ట్.. ‘ఓటీపీఆర్‌లో ఆ వివరాలు చేర్చండి’
రాష్ట్రంలోని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTP) ఉన్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్ధులు అందరూ తమ షెడ్యూల్ కుల గ్రూప్ వివరాలను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న జాబ్ నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీపీలో ఆయా కులాలకు చెందిన అభ్యర్ధుల..

అమరావతి, జూన్ 11: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించింది. ఇక ఈ విభజన ఏప్రిల్ 19, 2025 నుంచి అమలులోకి వస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం జీవోను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTP) ఉన్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్ధులు అందరూ తమ షెడ్యూల్ కుల గ్రూప్ వివరాలను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న జాబ్ నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీపీలో ఆయా కులాలకు చెందిన అభ్యర్ధుల గ్రూపు వివరాలు ఓటీపీలో ఎంటర్ చేయాలని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా ఈ మేరకు తమ వివరాలు నమోదు చేయాలని పేర్కొంది.
ఇదివరకే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరల వారి కులం ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతుందో పరిశీలించుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. కొత్త వారు వెబ్ సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెబ్ నోట్ విడుదల చేసింది. తదుపరి వచ్చే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు ఆన్ లైన్ దరఖాస్తు చేయడానికి ఇది తప్పనిసరి అని ఏపీపీఎస్సీ పేర్కొంది.
ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.