BSc Admissions: బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు..సెప్టెంబర్ 17తో ముగుస్తున్న రిజిస్ట్రేషన్లు

ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల, రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు..

BSc Admissions: బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు..సెప్టెంబర్ 17తో ముగుస్తున్న రిజిస్ట్రేషన్లు
BSc Admissions
Follow us

|

Updated on: Sep 12, 2024 | 8:02 AM

అమరావతి, సెప్టెంబర్‌ 12: ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల, రెండేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఓసీ అభ్యర్ధులు రూ.2,360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.1,888 బ్యాంకు ద్వారా రసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఏవైనా సందేహాలు, అభ్యంతరాలుంటే 89787 80501, 79977 10168 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి తాత్కాలిక ప్రాధాన్యత క్రమం విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉన్న వారు ఈ రోజు గడువు సమయం ముగిసేలోగా యూనివర్సిటీకి తెలియపర్చాలని పేర్కొంది.

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. సెప్టెంబర్‌ 23 నుంచి తరగతులు

తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘టీఎస్ పీజీఈసెట్‌ 2024’ తొలి విడత కౌన్సెలింగ్‌‌ ముగిసింది. తొలి విడతలో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబర్‌ 19వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ రమేష్‌బాబు వెల్లడించారు. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?