APGPCET 2022: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు 2022-23 నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి (అమరావతి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం..

APGPCET 2022: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు 2022-23 నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Apgpcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2022 | 7:30 AM

Dr B R Ambedkar Gurukulam admissions 2022-23: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి (అమరావతి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం (APGPCET 2022) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, అర్హతలు, ఇతర వివరాలు మీకోసం..

వివరాలు:

ఏపీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు 2022-23

అర్హతలు: 2020-21లో మూడో తరగతి, 2021-22లో నాలుగో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 2021-22 సంవత్సరానికిగానూ తల్లిదండ్రల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించరాదు.

వయోపరిమితి: సెపెంబర్‌ 1, 2011 నుంచి ఆగస్ట్‌ 31, 2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్ధులైతే సెప్టెంబర్‌ 1, 2009 నుంచి ఆగస్ట్‌ 31, 2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 24, 2022.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.