Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Practical Exams 2023: ఈ సారి ముందే ప్రాక్టికల్స్‌!.. ఫిబ్రవరి 26 నుంచి ఏపీ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు.. 

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలు మారాయి. మారిన తేదీల ప్రకారం వచ్చే నెల (ఫిబ్రవరి) 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో..

AP Inter Practical Exams 2023: ఈ సారి ముందే ప్రాక్టికల్స్‌!.. ఫిబ్రవరి 26 నుంచి ఏపీ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు.. 
AP Inter Practicals Revised Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2023 | 12:46 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలు మారాయి. మారిన తేదీల ప్రకారం వచ్చే నెల (ఫిబ్రవరి) 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 10 రోజుల పాటు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడదల చేశారు. ఇక కేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ ఏడాది థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను 17న నిర్వహిస్తారు. థియరీ పరీక్షల్లో ఎలాంటి మార్పు చేయలేదని, మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు యథాతథంగా కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.

గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్15 నుంచి మే10 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్స్‌ జరగనుండగా ఎంసెట్-2023 పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆయా కాలేజీ యాజమాన్యాల నుంచి ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. అందువల్లనే థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.