AP Inter Results: ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఏపీ ఇంటర్ మెమోలు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫలితాలను గత బుధవారం విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫలితాలను గత బుధవారం విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 72 శాతం మంది పాస్ అయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. ఈ లెక్కన ఈసారి కూడా ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇదిలా ఉంటే ఫలితాలు విడుదల చేసిన రోజున కేవలం మార్కుల జాబితాను మాత్రమే విడుదల చేసిన అధికారులు తాజాగా మార్కుల మెమోను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన మెమోలను ఆన్‌లైన్‌లో ఉంచారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందొచ్చు. ఈ మెమోలో సబ్జెక్ వారీగా మార్కుల వివరాలతో పాటు ఫొటో సైతం ముద్రించారు. ప్రస్తుతం ఈ వివరాలు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు కింద లింక్‌లు క్లిక్ చేసి పొందొచ్చు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమో పొందడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండ్ ఇయర్ మెమో కోసం ఈ లింక్ చేయండి..