NIT Recruitment: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు.. డిగ్రీ పాస్ అయితే చాలు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ బిహార్ పట్నాలోని క్యాంపస్‌లో ఉన్న పలు ఖాళీలను భర్తీచేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి.?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ బిహార్ పట్నాలోని క్యాంపస్‌లో ఉన్న పలు ఖాళీలను భర్తీచేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 200, ఇతరులు రూ. 400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 9,300 నుంచి రూ. 34,800 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 18-05-2023తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..