అమరావతి, జులై 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల ఎంపిక ప్రక్రయలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి. ఆయా ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దాదాపు 3,546 ఉద్యోగాల భర్తీకి గతేడాది హైకోర్టు నోటిపికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి జాబితాలో ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలోనూ ఉండటంతో వాటిని సరిచేస్తూ తాజాగా మరో జాబితా విడదల చేసింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు జులై 18 నుంచి 31 ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆయా తేదీల్లో సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపడుతారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఏయే తేదీల్లో ఏయే పోస్టులకు ధ్రువపత్రాల పరిశీల ఉంటుందంటే..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.