AP SSC Recounting 2025: పదో తరగతిలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు ఇలా దరఖాస్తు చేయండి..
Andhra Pradesh 10th Class Results 2025: బుధవారం ఉదయం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గత ఐదేళ్లలోనే అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే కొందరు విద్యార్ధులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే.. అలాంటి వారు రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు ఈ కింది విధంగా దరఖాస్తు చేసుకుని మార్కులు పెంచుకోవచ్చు..

అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మొత్తం 1,680 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. 19 పాఠశాలల్లో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదు. గత ఐదేళ్లలో 2022లో అతితక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అత్యధికంగా ఈ ఏడాదే (2025) ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ పదో తరగతి 2025 పబ్లిక్ పరీక్షల ఫలితాలు
తాజా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్ధులు రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రేపట్నుంచి అంటే ఏప్రిల్ 24, 2025వ తేదీ ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 1 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటికగ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. అలాగే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపుల నుంచి దరఖాస్తు వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ విధానంలోనే ఉంటుంది. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




