AAI Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి సదవకాశం.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఏఏఐ కార్యాలయాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఏఏఐ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 364 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) (02), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) (356), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) (04), సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21-01-2023 నాటికి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు, మేనేజర్‌కు 32 సంవత్సరాలు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా ఆన్‌లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి 22-12-2022న ప్రారంభమవుతుండగా, 21-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..