AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Recruitment: బీటెక్ అర్హతతో ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబైలోని ఎస్‌బీఐ కార్పొరేట్ సెంటర్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల..

SBI Recruitment: బీటెక్ అర్హతతో ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
SBI
Narender Vaitla
|

Updated on: Dec 11, 2022 | 9:54 AM

Share

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబైలోని ఎస్‌బీఐ కార్పొరేట్ సెంటర్‌ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) (06), డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్) (02), డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్) (05), డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్) (10 ), సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (01), ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (02), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్) (01) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్‌/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-07-2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* డీఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు నవీ ముంబైలో పని చేయాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 29-12-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు