AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Freshers Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. వాటిలో 53 శాతం జాబ్స్ వారికేనట..!

దేశంలో ఉన్న మెజారిటీ స్టార్టప్‌ కంపెనీలు 0 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక జాబ్‌ రోల్‌ విషయానికొస్తే గతేడాది సేల్స్‌ పొజిషన్‌లో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ అయినట్లు తేలింది. 2023 ఏప్రిల్‌తో పోల్చితే 2024నాటికి 23 శాతానికి పెరిగింది. ఫౌండిట్ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఐటీ, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో...

Freshers Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. వాటిలో 53 శాతం జాబ్స్ వారికేనట..!
Freshers Jobs
Narender Vaitla
|

Updated on: May 10, 2024 | 3:02 PM

Share

దేశంలో రోజురోజుకీ స్టార్టప్‌ కల్చర్ పెరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారంపై మొగ్గుచూపడం, ప్రభుత్వాలు సహకారం అందించడంతో స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగకల్పన సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. ఇక స్టార్టప్‌ కంపెనీలు ఎక్కువగా ఫ్రెషర్స్‌నే ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయనే విషయం వెల్లడైంది.

దేశంలో ఉన్న మెజారిటీ స్టార్టప్‌ కంపెనీలు 0 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక జాబ్‌ రోల్‌ విషయానికొస్తే గతేడాది సేల్స్‌ పొజిషన్‌లో ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ అయినట్లు తేలింది. 2023 ఏప్రిల్‌తో పోల్చితే 2024నాటికి 23 శాతానికి పెరిగింది. ఫౌండిట్ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఐటీ, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో కాస్త డిమాండ్ తగ్గినట్లు ఇందులో లేలింది. ఇక గతేడాదితో పోల్చితే భారతదేశంలో స్టార్టప్‌ల సంఖ్య 37% పెరిగింది.

ఉద్యోగ కల్పనలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ఏకంగా 14 శాతం పెరిగాయి. ఇక టైర్‌ 2, టైర్‌ 3 నగ్గరాల్లో స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. ఐటీ సేవల విభాగానికి చెందిన స్టార్టప్‌లు ఏప్రిల్‌ 2023, ఏప్రిల్ 2024 మధ్య 20% నుంచి 23% వరకు పెరగాయి. ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగాయి. అయితే ఇంటర్నెట్, BFSI/ఫిన్‌టెక్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలలోని స్టార్టప్‌లు స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు నియామకాలలో క్షీణత కనిపించింది. ఇదిలా ఉండగా, విద్య/ఇ-లెర్నింగ్/ఎడ్‌టెక్ పరిశ్రమలలోని స్టార్టప్‌లు ఏప్రిల్‌లో స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి.

ఇక నగరాల విషయంగా చూస్తే.. బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై మెట్రో ప్రాంతాలు స్టార్టప్ హబ్‌లుగా ముందున్నాయి. అయితే భారత్‌లో ప్రస్తుతం ఈ స్టార్టప్‌లు మెట్రో నగరాలను విస్తరిస్తోంది. నాన్-మెట్రో నగరాలు కూడా స్టార్టప్‌లకు అడ్డాగా మారుతున్నాయి. ఇక ఉత్పత్తి, తయారీ రంగం నియామకాలలో సంవత్సరానికి 31% గణనీయమైన పెరుగుదలను సాధించింది. ఈ రంగంలో గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్, కెమికల్, ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్‌లలో అభివృద్ధి కనిపించింది.

వీటితో పాటు గృహోపకరణాల పరిశ్రమలో కూడా వృద్ధి కనిపించింది. ఈ రంగంలో నియమకాల్లో 27 శాతం వృద్ధి కనిపించింది. ఏప్రిల్ నాటికి దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏసీ, కూలర్స్‌ వంటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇక హెల్త్‌కేర్‌ రంగంలో కూడా వృద్ధి కనిపించింది. అయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగాల క్షీణత 22 శాతం తగ్గింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..