PM Internship: 280 కంపెనీలు, లక్షకుపైగా అవకాశాలు.. పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌ఫిస్‌ పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 280 కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. లక్షకుపైగా ఇంటర్న్ షిప్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి..

PM Internship: 280 కంపెనీలు, లక్షకుపైగా అవకాశాలు.. పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో
Pm Internship Program
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2024 | 11:40 AM

దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌ఫిస్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.2024-25 బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 5వేల చొప్పున అందిస్తారు. అలాగే గ్రాంట్ కింద రూ. 6వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ఇక దేశంలోని దిగ్గజ ప్రవేట్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తారు. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా ఎందులో ఇటర్న్‌షిప్‌ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా పీఎం ఇంటర్న్‌సిప్‌ పథకంలో భాగంగా కార్పొరేట్‌ భాగస్వామ్యం కోసం ప్రారంభించిన ఆన్‌బోర్డింగ్ విండోను అధికారులు మూసేశారు. ఇందులో ఇప్పటి వరకు మొత్తం 280 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1,27,046 ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

పైల్‌ ప్రోగ్రామ్‌లో కార్పొరేట్‌ కంపెనీలు భాగస్వామ్యమయ్యేందుకు పీఎమ్‌ఐఎస్‌ పోర్టల్‌ www.pminternship.mca.gov.inని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. ఇందులో ఆయా కంపెనీలు తమ సంస్థల్లో ఇంటర్న్‌ షిప్‌ అవకాశాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఇక పీఎమ్‌ఐస్‌ పథకం ద్వారా అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 12న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది.

కాగా అక్టోబర్‌ 27 తేదీ నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని అన్ని ప్రధాన రంగాలకు చెందిన సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ముఖ్యంగా అగ్రి కల్చర్, ఆటోమోటివ్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్ ఇండస్ట్రీ, టాటా, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, ఇన్ఫోసిన్, హెచ్ డీఎఫ్ సీ, టెక్స్ టైల్, టెలికాం, మహీంద్రా, హీరో వంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 800 కోట్లు కేటాయించింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!