Gold Loan: 1శాతం వడ్డీ.. జీరో ప్రాసెసింగ్ ఫీజు.. గోల్డ్ లోన్ మేళా ప్రారంభం..
భారతదేశంలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటైన ఐఐఎఫ్ఎల్ ప్రత్యేకమైన గోల్డ్ మేళాను నిర్వహిస్తోంది. 2024, సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28 వరకూ ఈ మేళా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఈవెంట్ సమయంలో, కస్టమర్‌లు ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా నెలకు 1% వడ్డీ రేటుతో బంగారంపై రుణాలను పొందవచ్చు.
అత్యవసర సమయాల్లో నగదు కావాలంటే బెస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్.. ఇంట్లో బంగారు ఆభరణాలు ఉంటే తక్షణమే లోన్ మంజూరవుతుంది. ఇంటి నుంచే లోన్ పొందే అవకాశం కూడా కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. సాధారణంగా మనం బంగారాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సురక్షిత రుణ సదుపాయం. ఇక్కడ వడ్డీ రేటు మిగిలిన ఇతర రుణ సదుపాయాలతో పోల్చితే తక్కువే ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజులుంటాయి. సాధారణంగా ఇక్కడ వడ్డీ రేటు 7శాతం నుంచి ఉంటుంది. అయితే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా.. కేవలం 1శాతం వడ్డీతో ఓ బ్యాంకు మీకు గోల్డ్ లోన్లను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ మేళా..
భారతదేశంలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటైన ఐఐఎఫ్ఎల్ ప్రత్యేకమైన గోల్డ్ మేళాను నిర్వహిస్తోంది. 2024, సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 28 వరకూ ఈ మేళా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కు చెందిన ఢిల్లీ, గురుగ్రామ్‌లలో ఈమేళాను జరుగుతుంది. ఈ ఈవెంట్ సమయంలో, కస్టమర్‌లు ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా నెలకు 1% వడ్డీ రేటుతో బంగారు రుణాలను పొందవచ్చు. ఆర్బీఐ ఈ కంపెనీ గోల్డ్ లోన్ల మంజూరుపై విధించిన ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ ఈ చర్యలను తీసుకుంది.
ఆర్బీఐ పరిమితులు ఇలా..
2024, మార్చి 4న ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. కంపెనీ తన గోల్డ్ లోన్‌లను మంజూరు చేయడం, పంపిణీ చేయడం లేదా కేటాయించడం/సెక్యూరిటైజింగ్/అమ్మడం వంటివి చేయడాన్ని నిషేధించింది. కాగా ఇటీవల ఈ ఆంక్షలను తొలగించింది. అన్ని సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా బంగారం రుణాల మంజూరు, పంపిణీ, అసైన్‌మెంట్, సెక్యూరిటైజేషన్, అమ్మకాలను పునఃప్రారంభించేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఈ క్రమంలో గోల్డ్ మేళాను కంపెనీ ప్రారంభించింది.
గోల్డ్ లోన్ మేళా ఇలా..
తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన వ్యక్తులకు సరసమైన క్రెడిట్‌ను అందించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అనుకూలమైన డిజిటల్ చెల్లింపు ఎంపికలతో పాటు దాని పోటీ రుణ-విలువ (ఎల్టీవీ) నిష్పత్తులు, వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్‌ను కూడా హైలైట్ చేసింది.
కస్టమర్‌లు ఏదైనా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శాఖను సందర్శించవచ్చు లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రుణం పొందే ముందు నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదవాలని బ్యాంకు అధికారులు సూచించారు.
దేశంలో గోల్డ్ లోన్ ట్రెండ్స్..
మన దేశంలో బంగారానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎలాంటి పండుగైనా, వేడుకైనా బంగారమే మొదటగా కొనుగోలు చేస్తారు. అదే సమయంలో అత్యవసరమైతే ఆ బంగారం నుంచే నిధులు సమకూర్చుకుంటారు. సులభ ఆమోద ప్రక్రియ, తక్కువ వడ్డీ రేట్లు, బలమైన క్రెడిట్ చరిత్ర అవసరం లేకుండా అందుబాటులో ఉన్నందున బంగారు రుణాలు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. అత్యవసర పరిస్థితులు లేదా విద్య వంటి వివిధ అవసరాలకు అనువైన నిధులను దీని ద్వారా సమకూర్చుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..