AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని! చూస్తేనే మతి పోతోంది!

రోజురోజుకీ బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సందర్భంగా అసలు ప్రపంచానికి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా వెలికి తీస్తారు? ప్రపంచంలోని పెద్ద గోల్డ్ మైన్ ఏది? అన్న సందేహాలు కూడా వచ్చే ఉంటాయి. మరి అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా?

Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని! చూస్తేనే మతి పోతోంది!
Gold Mine
Nikhil
|

Updated on: Oct 13, 2025 | 2:36 PM

Share

బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.27 లక్షలు దాటింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం ధర పెరిగింది. అయితే అసలు ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం ఏంటో తెలుసా? అక్కడ ఏడాదికి ఎంత బంగారాన్ని వెలికి తీస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.

నెవాడా గోల్డ్ మైన్

ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని పేరు నెవాడా గోల్డ్ మైన్.ఇది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. ఈ గనిలో ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం వెలికి తీస్తుంటారు. భూమిపైనే అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాంతం పేరు సంపాదించుకుంది. ఈ గోల్డ్ మైన్ ను బారిక్ గోల్డ్, న్యూమెంట్ కార్పొరేషన్ అనే కంపెనీలు కలిపి నడుపుతున్నాయి. ఈ గనిలో ప్రతి సంవత్సరం సుమారు వంద టన్నులు అంటే లక్ష కిలోల బంగారం వెలికి తీస్తున్నారు.  ప్రస్తుతం భూమిపై వాడుకలో ఉన్న అతిపెద్ద బంగారు గని  ఇదే.

అమెరికా టాప్

ఈ గనిలో ప్రతిరోజు సుమారు 280 కేజీల బంగారం వెలికి తీస్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ బంగారు గని ఒక నిధిగా  ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశం కూడా అమెరికానే. దానికి ఈ గని కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మనదేశంలో కూడా బంగారు గనులు ఉన్నప్పటికీ వాటి నుంచి లభించే బంగారం చాలా తక్కువ. కాబట్టి మనం బంగారం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.

ట్విస్ట్ ఇదే

ఇకపోతే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశం అమెరికానే అయినా అంతకంటే ఎక్కువ బంగారం మన భారతీయ మహిళల దగ్గరే ఉంది. అమెరికా గోల్డ్ రిజర్వ్స్ మొత్తం కలిపి సుమారు 8 వేల టన్నులు అయితే భారతీయ మహిళల దగ్గర సుమారు 24 వేల టన్నుల బంగారం ఉందని ఒక అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..