OTP Frauds : ఈ ఒక్క తప్పుతో మీ జేబు గుల్లే.. ఫోజులిస్తూ కొట్టేస్తారు జాగ్రత్త..
ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు అంటూ అన్ని సేవలను ప్రజలు చాలా సులువుగా అందుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్ సేవల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో? అన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కేటుగాళ్లు మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా సింపుల్‌గా మన ఖాతాలోని సొమ్ముని మాయం చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో బ్యాంకు ఖాతాలో సొమ్ము వేయాలన్నా.. తీయాలన్నా.. ఎలాంటి బ్యాంకింగ్ సేవలు కావాలన్నా కచ్చితంగా బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకులు కూడా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు అంటూ అన్ని సేవలను ప్రజలు చాలా సులువుగా అందుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్ సేవల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో? అన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కేటుగాళ్లు మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా సింపుల్‌గా మన ఖాతాలోని సొమ్ముని మాయం చేస్తున్నారు. అయితే కేటుగాళ్లు రెచ్చిపోవాలంటే మనం అజాగ్రత్తతో చేసే చిన్న తప్పు వారి పాలిట వరంలా మారుతున్నాయి. ముఖ్యంగా ఫోన్‌కు వచ్చే ఓటీపీ ముష్కరులకు చెప్పడం వల్ల చాలా వరకూ మన సొమ్ము కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల ఓటీపీ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఓటీపీ మోసాలు ఎలా చేస్తారు. వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలి? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.
స్కామర్‌లు మీ డబ్బును దొంగిలించే మార్గాలు
- బ్యాంక్ అధికారులుగా పోజులిచ్చి మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడం.
- లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను యాక్సెస్ చేయడం.
- మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను మార్చమని హ్యాకర్లు మీ బ్యాంకులను అభ్యర్థించడం ద్వారా ఓటీపీని తెలుసుకోవడం.
- నకిలీ గుర్తింపు రుజువుతో మొబైల్ ఆపరేటర్‌ను సంప్రదించి, అదే నంబర్‌తో కొత్త సిమ్‌ను అభ్యర్థించడం
మోసం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
- మీ ఓటీపీ, పిన్ నంబర్‌ను ఎవరికీ ఎప్పుడూ వెల్లడించవద్దు.
- అనుమానాస్పద నంబర్ నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా అటెండ్ చేయవద్దు
- బ్యాంక్ అధికారి అని చెప్పుకునే వ్యక్తి నుంచి వివరణాత్మక ప్రశ్నలు అడగడం ద్వారా మోసం నుంచి బయటపడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి