AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union budget: కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తారా..?ఆశగా ఎదురుచూస్తున్న పరిశ్రమలు

పార్లమెంటు ముందుకు త్వరలో కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో మినహాయింపులు కోసం వివిధ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపుపన్ను పరిమితిని పెంచుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు వివిధ రంగాలు తమకు వచ్చే రాయితీలు కోసం ఆసక్తిగా వేచి ఉన్నాయి. దేశంలో వివిధ వస్తువుల తయారీని ప్రోత్సహించడానికి పరిశ్రమలకు రాయితీలు కల్పించడం చాలా అవసరం.

Union budget: కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తారా..?ఆశగా ఎదురుచూస్తున్న పరిశ్రమలు
Budget
Nikhil
|

Updated on: Jan 21, 2025 | 3:45 PM

Share

పరిశ్రమలు బాగుంటే అనేక మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, పాదరక్షలకు సంబంధించిన ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ఆయా రంగాల ప్రముఖులు కోరుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిలో అందించే మినహాయింపుల కోసం ఎదురు చేస్తూనే.. కొన్నిరాయితీలను ప్రభుత్వం నుంచి పరిశ్రమల యాజమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు కోసం ఆయా రంగాలు ఎదురు చూస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఔషధాలలో వాడే ముడి పదార్థాలపై కొన్ని సుంకాలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తయారీ పరంగా తమకు ఈ ప్రోత్సాహం ఇవ్వాలని ఈ పరిశ్రమలు కోరుతున్నాయి. ముఖ్యంగా ముడి సరుకులపై ట్యాక్సులు తగ్గితే తమకు ప్రయోజనంగా ఉంటాయని చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రేట్ల హేతుబద్డీకరణ, నిర్వహణను సులభతరం చేయడం అనేవి కస్టమ్స్ రంగం నుంచి కీలకమైన డిమాండ్లుగా ఉన్నాయి. వివిధ సంస్థలు తమ ఉత్పత్తులకు కావాల్సిన ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. ఈ సమయంలో వాటి నుంచి ప్రభుత్వం కొంత పన్ను వసూలు చేస్తుంది. దాన్నే కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ, మూలం, వర్గీకరణ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ముడి సరుకులపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తే ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే దేశీయ తయారీకి మద్దతు లభిస్తుందని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరితం ముందుకు తీసుకువెళ్లే అవకాశం కలుగుతుందన్నారు.

దీర్ఘకాలంగా ఉన్న కస్టమ్స్ వివాదాలను పరిష్కరించేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి 40 వేలకు పైగా కేసులు కోర్టులు, టిబ్యూనళ్లలో పెండింగ్ లో ఉన్నాయి. ఆమ్నెస్టీ పథకం ప్రవేశపెడితే ఈ వివాదాలు తగ్గి వ్యాపారాలు సులభతరమవుతాయి. ఈ కేసుల కారణంగా కోట్ల విలువైన వ్యాపారం నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..