AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Economic growth: ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్.. మన దేశంపై దావోస్ డబ్లూఈఎఫ్ చీఫ్ ప్రశంసలు

మన దేశం ప్రగతి పథంలో శరవేగంగా పరుగులు పెడుతుంది. అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. సుస్థిర రాజకీయం విధానం, సమర్థవంతమైన పాలన, కష్టబడి పనిచేసే ప్రజలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అనేక అంశాలు దీనికి కారణమని చెప్పవచ్చు.

Economic growth: ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్.. మన దేశంపై దావోస్ డబ్లూఈఎఫ్ చీఫ్ ప్రశంసలు
Economic Growth
Nikhil
|

Updated on: Jan 21, 2025 | 4:00 PM

Share

ప్రస్తుతం మన దేశంలో ఏటా 7 నుంచి 8 శాతం వృద్ధి నమోదవుతోంది. కొంతకాలానికి అది 20 శాతం చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ విషయం చెబుతున్నది మన దేశంలోని పాలకులో, నాయకులో కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈవో బోర్లే బ్రేండ్ వ్యాఖ్యానించడం విశేషం. మన దేశం గురించి దావోస్ లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య విషయాలను తెలుసుకుందాం. భారతదేశానికి గొప్ప సామర్థ్యం ఉందని, అక్కడ ఏటా 6 శాతం ఆర్థిక వృద్ధి పెరుగుతూ ఉందని బోర్లే బ్రెండ్ అన్నారు. కొన్ని సంవత్సరాలలో అది 20 శాతానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 1.20 లక్షలకు పైగా స్టార్టప్ లు ఉన్నాయని, అక్కడి పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తు వృద్ధి కి దోహదపడుతుందన్నారు. మౌలిక సదుపాయాలు, విద్య, పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ప్రగతి సాధ్యమవుతోందన్నారు.

బ్రెండ్ మాట్లాడుతూ భారత దేశం త్వరలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని తెలిపారు. డిజిటల్ వాణిజ్యం, సేవల వైపు ఎక్కువగా మొక్కు చూపుతోందన్నారు. కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే దీని వల్ల స్పల్పకాలికంగా కొన్ని సవాళ్లు కలుగుతాయన్నారు. ఏది ఏమైనా భారత దేశంలో అభివృద్ధి తరంగాలు బలంగా వీస్తున్నాయన్నారు. దావోస్ లో సోమవారం నుంచి వరల్ట్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 55వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భారత్ అత్యంత ప్రాధాన్యం కలిగిన దేశంగా ఉంది. ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, దాదాపు 100 మంది సీఈవోలు, ప్రభుత్వం, పౌర సమాజం, కళారంగానికి చెందిన వారిని కేంద్ర ప్రభుత్వం పంపించింది. మన ప్రతినిధులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వం వహిస్తున్నారు.

స్విట్జర్లాండ్ లోని ప్రముఖ పట్టణమైన దావోస్ లో జరిగే ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్ట్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్ స్కీ తదితరులు ప్రసంగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 60 మంది ప్రముఖ రాజకీయ నాయకులు తరలిరానున్నారు. ఈ సమావేశం కోసం 5 వేల మంది స్విస్ ఆర్మీ సిబ్బందిని మోహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..